ట్రంప్ తన విధానాన్ని చాపకింద నీరులా అమలు చేస్తున్నాడు ఒక పక్క  వీసాల విషయంలో ముప్పు తిప్పలు పెడుతూ రోజుకో ప్రకటన చేస్తూ ఎన్నారై లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ట్రంప్..ఇప్పుడు మరో పిడుగు భారతీయ కాల్ సెంటర్స్..ఔట్సొర్సింగ్ ఉద్యోగాగులపై వేశాడు..వివరాలలోకి వెళ్తే..

 Image result for indian call centers job effect america bill

భారత కాల్‌ సెంటర్లపై తీవ్ర ప్రభావం చూపే బిల్లును అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. అమెరికన్‌ కాల్‌ సెంటర్లను పరిరక్షించాలని డెమొక్రటిక్‌ సెనేటర్‌ షెర్రాడ్‌ బ్రౌన్‌ ఈ బిల్లులో ప్రతిపాదించారు...అయితే ఈ బిల్లు చట్టమైతే మాత్రం భారత్‌లోని కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలు ప్రమాదంలో పడక తప్పదు. ఇదిలాఉంటే  “బై అమెరికన్, హైర్‌ అమెరికన్‌” అన్న ట్రంప్‌ విధానంలో భాగంగా ఈ బిల్లు ను ప్రవేశపెట్టారని తెలుస్తోంది..

 Image result for america new bill against call centers

ఈ బిల్లుని సభలో ప్రవేశ పెట్టిన తరువాత బ్రౌన్‌ మాట్లాడుతూ.. ‘చాలాకాలంగా అమెరికా వాణిజ్యం, పన్ను విధానం కార్పొరేట్‌ వ్యాపారాల్ని ప్రోత్సహించాయి...అమెరికా నౌకల ఉత్పత్తి పరిశ్రమలు మెక్సికోలోని రైనోసాకు, చైనాలోని వుహాన్‌కు తరలిపోయాయి. కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలు ఇతర దేశాలకు తరలిపోయాయి..ఈ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల వల్ల ఎందరో అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయార’న్నారు.  

 Image result for america new bill against call centers

ఈ బిల్లులో ముఖ్యంగా ప్రతిపాదించిన అంశాలు.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను విదేశీయులకు కాకుండా అమెరికన్లకు ఇచ్చే కంపెనీలకే ఫెడరల్‌ కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో ప్రాధాన్యం.భారత్‌ వంటి దేశాల కాల్‌ సెంటర్‌ ఉద్యో గులు తామున్న ప్రాంతాన్ని వినియోగదారులకు కచ్చితంగా తెలియచేయాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: