కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెంది ఎన్నో దేశాలకి  ప్రాణ ,ఆర్ధికంగా నష్టాన్ని మిగుల్చుతున్న  విషయం విధితమే. అన్నిదేశాలకంటే కూడా అమెరికాపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. వేల సంఖ్యలో ప్రాణాలు పోయాయి లక్షల సంఖ్యలో బాధితులు మిగిలారు..ఈ ఫలితంగా లాక్ డాన్ ఏర్పడి జనజీవనం స్తంభించి పోయింది..దాంతో ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్ధిక పరిస్థితి కుంగిపోవడం, నిరుద్యోగ సమస్య  హెచ్చు మీరడం ఇలా అమెరికాలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.  అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ ఎంత త్వరగా ఇండియా వెళ్లిపోతామోనని ఎదురు చూస్తున్నారు. అయితే

IHG

అమెరికా ప్రజలు విదేశాలలో ఎక్కడ ఉన్నా సరే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశాం వచ్చేయండి అంటూ ట్రంప్ కొన్ని రోజుల క్రితమే పిలుపు ఇచ్చారు. కానీ  అమెరికా ప్రజలు మాత్రం అమెరికా వెళ్ళాలంటే ఇష్టత చూపడంలేదని ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికా వెళ్ళేది లేనే లేదంటూ తేల్చి చెప్పేశారు.. మరీ  ముఖ్యంగా భారత్ లో ఉంటున్న అమెరికా వాసులు ఇప్పట్లో అమెరిక వచ్చేది లేదని అంటున్నారు. అమెరికా కంటే ఇప్పుడు ఇండియానే సురక్షితంగా ఉందని ఇండియాలో ఉంటేనే ప్రాణాలు దక్కుతాయనే ఆలోచనలో ఉన్నారట.

IHG

అమెరికా వెళ్లేందుకు ప్రత్యేకమైన విమానాలు సిద్దం చేసినా ఎక్కడా కూడా సీట్లు భర్తీ కాలేదని అమెరికాకి చెందిన దౌత్యవేత్త బ్రౌన్ లీ తెలిపారు. గడించిన వారంలో ఇండియా నుంచీ సుమారు ఆరువేల మంది అమెరికన్స్ స్వదేశానికి వెళ్ళారని..ప్రస్తుతం మరో 4 వేల మంది వెళ్ళాల్సి ఉండగా వారి నుంచీ స్పందన కరువైందని అంటున్నారు. ఏది ఏమైనా అమెరికా కంటే కూడా భారత్ ఎంతో సురక్షిత దేశంగా అమెరికన్స్ గుర్తించారు. ఇదిలాఉంటే కేవలం అమెరికన్స్ మాత్రమే కాదు అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ కూడా బ్రతికి ఉంటే బలుసాకు తినచ్చు అన్నట్టుగా ఇండియా వచ్చేయడానికి సిద్దమయ్యిపోయారని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: