బిడెన్ అధ్యక్షతన కొలువు దీరిన కొత్త ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఊరట కల్పించేవిధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అమెరికా వెళ్లి స్థిరపదాలను, చదువుకోవాలని, లేదంటే వ్యాపారాలు చేయాలని భావించిన వారికి ట్రంప్ హాయంలో నిరాశ ఎదురైన విషయం విధితమే ఈ నేపధ్యంలో  బిడెన్ ప్రభుత్వం భారతీయులకు గుడ్ న్యూస్ తెలిపింది. ట్రంప్ అనుసరించన విధానాలను పూర్తిగా చెత్త బుట్టలోకి వేసి నూతన విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుకున్నదే తడవుగా యూఎస్ సిటిజన్ షిప్ యాక్ట్ – 2021 ని ప్రవేశ పెట్టింది..అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలో బిడెన్ ఈ కీలక బిల్లుపై సంతకం చేశారు.

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని సాగనంపే చర్యలను ఈ బిల్లు కారణంగా మార్చ్ -21 వరకూ నిలిపివేశారు అంటే సుమారు 60 రోజుల సమయాన్ని ఇచ్చారు. ఇక ఈ బిల్లు కారణంగా ముఖ్యంగా భారతీయులు లాభపడనున్నారు. అమెరికాలో హెచ్ -1 బి వీసా దారులుగా భారతీయులే అత్యధికంగా ఉన్నారు.అంతేకాదు కొత్త వీసాల కోసం ఎదురు చూస్తున్న వారిలో కూడా భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపధ్యంలో  హెచ్ -1బీ పై కల్పించిన తాజా వెసులుబాటు పై భారతీయ ఎన్నారైలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..ఈ వెసులుబాటు కారణంగా..
కేవలం హెచ్ -1బీ  వీసా దారులు మాత్రమే కాదు సదరు వ్యక్తిపై ఆధారపడిన డిపెండెంట్ లు, కుటుంభ సభ్యులు కూడా లాభపడనున్నారు. భార్య, లేదంటే కుటుంభ సభ్యులు కూడా వర్క్ పర్మిట్ లు పొందటానికి ఈ బిల్లు కారణంగా అర్హులుగా పరిగణించబడుతారు. పిల్లలకు ఉన్న వయసు నిభంధనలు కూడా ఈ బిల్లు కారణంగా తొలగిపోయాయి. అత్యంత నైపుణ్యం ఉన్న వారికి కంపెనీలు భారీ వేతనాలు కూడా చెల్లించుకోవచ్చు అమెరికాలో ఉన్నత విద్య చదువుకునే నిష్ణాతులైన విద్యార్ధులకు గ్రాడ్యుయేషన్ చేసేవారికి మరేయితర ఉన్నత విద్యావంతులకు దేశంలో ఉండే అర్హత కల్పిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: