గిన్నిస్ బుక్ లాంటి ప్రపంచ రికార్డు సృష్టించాలి అంటే అంత సులభమైన విషయం కాదు అన్న విషయం తెలిసిందే. ఏదైనా ఒకే విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తమలాగా ఆ పనిని చేయలేరు అని నిరూపించినప్పుడు మాత్రమే వరల్డ్ రికార్డు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలా గిన్నిస్ బుక్ రికార్డులో తమ పేరును చూసుకోవడానికి కొంతమంది చాలా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఏకంగా కొన్ని కొన్ని సార్లు ప్రాణాలను ఫణంగా పెట్టి మరి విన్యాసాలు చేసి ఇలా ప్రపంచ రికార్డు సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే మొన్నటి వరకు ఇలా ఎన్నో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తేనే ప్రపంచ రికార్డు సాధించవచ్చు అని ఎంతో మంది అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా చిన్న చిన్న పనులను కూడా ఎవరికి సాధ్యం కాని రీతిలో చేస్తే ప్రపంచ రికార్డు సైతం దాసోహం అవుతుంది అని నిరూపించే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొంతమంది ఏకంగా మద్యం తాగి గినేస్ రికార్డు కొల్లగొడుతూ ఉంటే.. ఇంకొంతమంది ఏకంగా గడ్డం పెంచుకొని మరి ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి అందరికీ తెలిసిన పని చేసి ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కాడు.


 ఇంతకీ అతను ప్రపంచ రికార్డు సృష్టించడానికి ఏం చేశాడో తెలుసా.. హ్యాండిల్ వదిలేసి సైకిల్ తొక్కాడు. ఓస్ అంతేనా మేము చిన్నప్పుడే అలాంటిది చేసాం. ఇలాంటిది చేస్తే గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తారు అని తెలిస్తే మా పేరు కూడా ఆ రికార్డుల్లో ఉండాల్సిందే అంటారా.. అయితే అతను హ్యాండిల్ వదిలేసి సైకిల్ తొక్కిన మాట వాస్తవమే. కానీ ఎంత దూరం తొక్కాడో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. సాధారణంగా అయితే మనం కొన్ని సెకండ్ల పాటు హ్యాండిల్ వదిలేసి సైకిల్ తొక్కుతాం. కానీ కెనడాకు చెందిన రాబర్ట్ ముర్రే అనే వ్యక్తి 130.29 కిలోమీటర్ల పాటు హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ తొక్కేశాడు. ఐదు గంటల 37 నిమిషాల్లో ఈ ఫీట్ సాధించి గిన్నిస్ బుక్ రికార్డు లోకి ఎక్కాడు. ఆల్జీమర్స్ బాధితులకు నిధులు సేకరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri