
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వైసీపీ మధ్య విమర్శలతో ఆంధ్ర రాజకీయాలు హాట్ హాట్ గానే ఉన్నాయి. తాజాగా వల్లభనేని వంశీ అంశం తెరమీదకు రావడంతో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే వల్లభనేని వంశీ వైసీపీలో చేరతానని క్లారిటీ వచ్చాకే చంద్రబాబు విమర్శిస్తున్నారు అంటూ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వంశీ చేసిన విమర్శలపై ఆగ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు వల్లభనేని వంశీ ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలో వల్లభనేని వంశీ చంద్రబాబు ఏం చేయగలరు నేను ముందే పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పాను ఇంకేం చేయగలరు అంటూ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నారా లోకేష్ ని ఎన్టీఆర్ తో పోల్చిన వల్లభనేని వంశీ నారా లోకేష్ కి ఎన్టీఆర్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాకుండా రాజేంద్రప్రసాద్, బోడె ప్రసాద్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ. అయితే దీనిపై స్పందించిన బోడె ప్రసాద్ తాను రాజేంద్రప్రసాద్ కు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు అంటూ తేల్చి చెప్పారు. కాగా వంశి వాక్యాలను టిడిపి నేతలు తప్పు పడుతున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెనుక సీఎం జగన్ ఉండి ఇలా మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. జగన్ వంశీని ఒక పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వల్లభనేని వంశీ నిందలు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అయితే టిడిపి అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్న వల్లభనేని వంశీ వైసిపి తీర్థం ఎప్పుడు తీసుకుంటారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో వల్లభనేని వంశీ అంశం చర్చనీయాంశంగా మారింది.