దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్బిఐ. ఎక్కువ మంది వినియోగదారులు కలిగి...మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న  బ్యాంకు ఎస్బిఐ. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎన్ని ఉన్నప్పటికీ ఎస్బిఐ బ్యాంకుకు  మాత్రమే ఎక్కువగా వినియోగదారుల సంఖ్య ఉంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు వివిధ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. మనీ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్,  లోన్స్,  చెక్ బుక్ ఇలాంటి ఎన్నో సేవలను వినియోగదారులకు అందిస్తుంది స్టేట్  బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే తమ తమ ఖాతాదారులను ఆకర్షించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినూత్న స్కీములను ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోని ఖాతాదారులకు యాన్యుటీ  డిపోసిట్ స్కీమ్  అందుబాటులో ఉంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బిఐ కొత్త స్కీమ్ అయినా యాన్యుటీ  డిపాజిట్ స్కీం ద్వారా ఖాతాదారులు కొంత మొత్తం డబ్బును పొందే అవకాశం కల్పిస్తుంది. 

 

 

 

 దీనికోసం ఎస్బిఐ ఖాతాదారుడు ఒకేసారి కొంత మొత్తం డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా అకౌంట్ హోల్డర్ కి కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఖాతాదారుడు డిపాజిట్ చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని చెల్లించడంతో పాటు...  మొత్తం డిపాజిట్ చేసిన సొమ్ము పై వచ్చిన వడ్డీని కలిపి అకౌంట్ హోల్డర్ కు అందజేస్తుంది ఎస్బిఐ. అయితే ఖాతాదారుడు డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తానికి వడ్డీ చెల్లింపు ప్రక్రియ డిపాజిట్ చేసిన తర్వాత  నెల నుంచి ప్రారంభమవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త యాన్యుటీ  స్కీమ్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం లను పోలి ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ యాన్యుటీ  స్కీమ్ లో ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసే అవకాశం కల్పిస్తుంది స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

 

 

 

 అయితే ఈ డిపాజిట్ సొమ్మును 25 వేల నుంచి ఎంత మొత్తం అయినా డిపాజిట్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం లో మాత్రం సదరు వ్యక్తి కేవలం 4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంది. 36,  60, 84, 120 నెలల కాల పరిమితితో ఎస్పీ తీసుకువచ్చిన కొత్త స్కీం ద్వారా  డిపాజిట్ చేయవచ్చు. అయితే ఈ స్కీం ద్వారా డిపాజిట్ చేసిన ఖాతాదారుడు ప్రతినెలా వెయ్యి రూపాయల వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది. ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్ లకు చెల్లించినట్లు గానే ఈ యాన్యుటీ  స్కీమ్ డిపాజిట్లకు వడ్డీ   చెల్లిస్తోంది. అయితే ఈ యాన్యుటీ  స్కీమ్ లో లోన్  సదుపాయం కూడా కనిపిస్తోంది. ఒకవేళ డిపాజిట్ దారుడు మరణిస్తే డిపాజిట్ సొమ్ములో  మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: