విదేశీ హాలిడే ట్రిప్ కు  వెల్లిన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. విదేశీ ట్రిప్ హ్యాపీ గా సాగాలని మంచి హోటల్ లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాక చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇక్కడ అయిదుగురు సభ్యులకు ఇలాంటి ఘటన ఎదురైంది. బ్రిటన్ ఫ్యామిలీకి చెందిన ఐదుగురు సభ్యులు ఈజిప్టు కు  వచ్చారు. బసచేయడానికి ఫైవ్ స్టార్ హోటల్ రూమ్స్ బుక్ చేసుకుని క్యాబ్ లో ఫైవ్ స్టార్ హోటల్ కి చేరారు. అయితే అప్పటికే క్యాబ్ డ్రైవర్ వాళ్లకి చెబుతూనే ఉన్నాడు అలాంటి పేరుతో  ఏ హోటల్ లేదు అని . రూమ్ బుక్ చేసుకున్నాక హోటల్ లేకుండా ఎలా ఉంటుంది అంటూ ఐదుగురు సభ్యులు క్యాబ్ డ్రైవర్ ను  ప్రశ్నించారు. అడ్రస్ కి వెళ్లి చూశాక నిజంగానే ఆ ఐదుగురు సభ్యులు కంగుతిన్నారు. అక్కడ నిజంగానే ఎలాంటి హోటల్ లేదు. అయితే ట్రావెల్ కంపెనీ లవ్ హాలిడేస్  ద్వారా ఒక స్టార్ హోటల్లో రూమ్ కోసం... మార్క్ వుడ్ అనే వ్యక్తి ఏకంగా 3.2 లక్షల రూపాయలు చెల్లించారు . ఆన్లైన్లో ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ ను  రెండు వారాలపాటు అద్దెకు తీసుకున్నారు. హోటల్ పేరు క్రిస్టల్ బీచ్ ఆక్వా పార్క్ అండ్ హోటల్. బీచ్ పక్కన వాటర్ పార్క్ ఆ పక్కన  ఫైవ్ స్టార్ హోటల్ ఉంది కదా అని బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాక మాత్రం ఆ ఐదుగురు కి భారీ షాక్ తగిలింది.

 

 

 

 మీరు బుక్ చేసుకున్న ఫైవ్ స్టార్ హోటల్ ఇంకా పూర్తికాలేదు అని  మేనేజర్లు తెలిపారు. మరి నిర్మించకుండా ఆన్లైన్లో హోటల్ బుకింగ్ ఎందుకు ఏర్పాటు చేశారని వారు ప్రశ్నించగా... మీరేం వర్రీ కాకండి అంటూ మేనేజర్ తెలిపారు. మీకు  వేరే చోట బస కల్పిస్తామని తెలిపారు. అయితే అక్కడ మేనేజర్లు ఆ  అయిదుగురు టూరిస్ట్ లకు  వేరే చోట  రూమ్ ఇచ్చారు. అది చూస్తే మొత్తం మురికిగా ఫర్నిచర్ మొత్తం పగిలిపోయి... ఎప్పుడు కుదురుతుందో అన్నట్లుగా ఉంది ఆ హోటల్ . దీంతో చిర్రెత్తిన ఐదుగురు సభ్యులు హోటల్ యాజమాన్యం పై కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హోటల్ యాజమాన్యం రెండు రోజుల తర్వాత ఆ టూరిస్టులను మరో హోటల్ కి షిఫ్ట్  చేసినప్పటికీ ఆ హోటల్ కూడా అంత బాగా లేకపోవడంతో ఆ  ఫ్యామిలీ తమ  డబ్బులు తమకు ఇచ్చేయాలంటూ డిమాండ్ చేసింది. ఇక హోటల్ యాజమాన్యం చేసేదేమీ లేక ఆన్లైన్లో వాళ్ళ డబ్బులు వారికి పంపించారు  ఇంకొన్ని డబ్బులు పెండింగ్లోనే పెట్టారు. 

 

 

 

 దీంతో ఐదుగురు టూరిస్టులు మోసపోయామని గ్రహించారు. ఎంతో హ్యాపీగా గడపాల్సిన ట్రిప్ కాస్త ఓ చెడు అనుభవం లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తిరిగి బస్సు ఎక్కిన ఫ్యామిలీకి మరో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్ట్ కి వెళ్లాల్సిన బస్సు కాస్తా హోటల్ దగ్గర ఆగిపోయింది. ఫ్లైట్ కి టైం అవుతుండడంతో వాళ్లు బస్సు దిగి టాక్సీ ఎక్కాల్సి వచ్చింది. ఈజిప్టు వెళ్ళిన తర్వాత ట్రావెల్ సంస్థను ఒత్తిడి చేయడంతో కొన్ని రోజుల తర్వాత కొంత డబ్బులు చెల్లించి కొంత డబ్బును అలాగే ఉంది. దాదాపు ఐదుగురు టూరిస్టులు  మూడు లక్షల డబ్బులు పోగొట్టుకున్నారు. దేశం కాని దేశంలో వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి ఆ ట్రావెల్ సంస్థ వెబ్సైట్ నుంచి నకిలీ హోటల్ తొలగించినట్లు తెలిసింది. ఎంతో హ్యాపీగా సాగిపోతుంది అనుకున్న హాలిడే ట్రిప్ కాస్తా కాలరాత్రిలా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: