కొంతకాలం నుంచి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వరుస ట్వీట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా జగన్ టార్చర్ వల్ల కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయని తెలుపుతూ పలు లెక్కలను చెప్పుకొచ్చారు. అయితే విజయసాయి రెడ్డి కూడా తమ ప్రభుత్వాన్ని పార్టీని డిఫెండ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారని చెప్పక తప్పదు. అయితే తాజాగా బాబు తెచ్చిన కంపెనీలతో పాటు ఆయన చెల్లించాల్సిన బకాయిల విషయాన్ని విజయసాయి రెడ్డి బయట పెట్టారు. 


బాబు ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిల భారం రెండు లక్షల కోట్ల పైనే ఉందని, తక్షణ చెల్లింపులు జరపాల్సిన కాంట్రాక్టర్ల బిల్లులు, విద్యుత్తు కొనుగోలు బాకీలు, ఫీజు రీఇంబర్స్ మెంట్లు మాత్రమే కాకుండా ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయని, ఇప్పుడు పత్తి గింజల్లాగా సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు విజయ సాయి రెడ్డి. 

అంతేకాకుండా "పులిచింతల గేటు పై అబద్ధాన్ని నిజం చేయడానికి ఎల్లో మీడియా, బాబు మనుషులు దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. డ్యాం నింపే ముందు పాటించాల్సిన ప్రోటోకాల్స్ ను గాలికొదిలేసింది బాబు ప్రభుత్వం. గేట్లు, తీగలు బలహీనంగా ఉన్నాయని 2015లో నిపుణులు ఇచ్చిన నివేదిక బాబు బతుకును బయట పెట్టింది", "ఎంపీ రఘురామరాజు కు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి రూ. 826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని నేను రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు. విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారు" అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. అలా గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో వివాదాస్పదమైన అంశాల గురించి వరుస ట్వీట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: