విశాఖపట్నం తెలుగుదేశం పార్టీలో ఉన్న బలమైన నాయకుల్లో పి‌జి‌వి‌ఆర్ నాయుడు(గణబాబు) ఒకరు. మొదట నుంచి టీడీపీలో పనిచేసుకుంటూ వస్తున్నగణబాబు టీడీపీలో కీలక నాయకుడుగా ఎదిగారు. తన తండ్రి అప్పలనరసింహం వారసుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, 1999 ఎన్నికల్లో తొలిసారి టి‌డి‌పి తరుపున బరిలో దిగి పెందుర్తి నుంచి విజయం సాధించారు. ఇక 2004 ఎన్నికల్లో ఓటమి పాలైన గణబాబు, ఆ తర్వాత చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్లారు. గంటా శ్రీనివాసరావు వెనుకే గణబాబు కూడా నడిచారు. ఇక ప్రజారాజ్యం తరుపున 2009 ఎన్నికల్లో విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పి‌ఆర్‌పి, కాంగ్రెస్‌లో విలీనం కావడం, రాష్ట్ర విభజన జరగడంతో మళ్ళీ గంటాతో కలిసి టి‌డి‌పిలోకి వచ్చేశారు.

ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పైగా టి‌డి‌పి అధికారంలో ఉండటంతో ఐదేళ్ల పాటు గణబాబుకు రాజకీయంగా తిరుగులేకుండాపోయింది. అలాగే వెస్ట్‌లో తన బలాన్ని మరింత పెంచుకున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా సరే వెస్ట్‌లో గణబాబు మళ్ళీ విజయం సాధించగలిగారు. ఇక ఇక్కడ నుంచి గణబాబు సైలెన్స్ రాజకీయం మొదలైంది.

టీడీపీ అధికారం కోల్పోయి, వైసీపీ అధికారంలోకి రావడంతో విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈయన పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. కానీ గంటా పార్టీ మారలేదు...అలా అని టి‌డి‌పిలో కనిపించడం లేదు. ఇటు గణబాబు కూడా అదే లైన్‌లో వెళుతున్నారు. టి‌డి‌పిలో యాక్టివ్‌గా లేరు. అలా అని వేరే పార్టీలోకి వెళ్లలేదు. ఏదో అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు కనిపిస్తున్నారు. ఏదో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గణబాబు పనిచేసుకుంటూ వెళుతున్నారు.

అటు వైసీపీ తరుపున మళ్ల విజయ్ ప్రసాద్ పనిచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండటం, ప్రభుత్వ పథకాలు మళ్లకు ప్లస్ అవుతున్నాయి. పైగా గణబాబు సరిగా యాక్టివ్‌గా లేకపోవడం మళ్లకు కలిసొస్తుంది. అయితే ప్రస్తుతానికైతే గణబాబు రాజకీయంగా బాగా క్లారిటీ మిస్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఈయన టి‌డి‌పిలోనే కొనసాగుతారో లేక వేరే పార్టీలోకి జంప్ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp