జగన్ మంత్రివర్గంలో మార్పులు ఎప్పుడు చేస్తారో తెలియదు గానీ..ఈలోపు పదవులు ఆశించే ఎమ్మెల్యేలు బాగా టెన్షన్ పడేలా ఉన్నారు....జగన్ ఎవరిని క్యాబినెట్‌లో తీసుకుంటారనే ఉత్కంఠ పెరిగిపోతుంది...ఇప్పటికే జిల్లాల వారీగా ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది...అయితే అన్నీ జిల్లాల్లో పదవులు ఎవరికి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో కాస్త క్లారిటీ వస్తుంది గానీ, కర్నూలు జిల్లాలో ఎవరికి ఛాన్స్ వస్తుందో మాత్రం క్లారిటీ రావడం లేదు.

ఎందుకంటే ఇక్కడ అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు...వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది తెలియడం లేదు. ప్రస్తుతం జిల్లాలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాంలు మంత్రులుగా ఉన్నారు. నెక్స్ట్ 100 శాతం మంత్రివర్గంలో మార్పులు చేస్తే..ఇద్దరు పక్కకు తప్పుకోవాల్సిందే...అలా కాకుండా బుగ్గనని ఖచ్చితంగా కొనసాగించాలని అనుకుంటే, జయరాం సైడ్ అయిపోతారు. ఎవరు మంత్రివర్గం నుంచి తప్పుకుంటారనే విషయాన్ని పక్కనబెడితే....ఎవరికి క్యాబినెట్‌లో చోటు దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే పదవులు ఆశించే లిస్ట్ పెద్దగా ఉంది...మంత్రి పదవి అంటే ఎవరికైనా ఆశ కాబట్టి...కర్నూలులో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. సీనియర్లు అయినా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు యువ నేతలు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రా కిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి, కర్నూలు సిటీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌లు సైతం రేసులో ఉన్నారు.

ముస్లిం కోటాలో ఏదైనా ఛాన్స్ రాకపోతుందా అని హఫీజ్ ఖాన్ చూస్తున్నారు. ఇక అన్నదమ్ములు అయినా మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డిలు సైతం మంత్రి పదవి ఆశించే లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇటు ఎస్సీ కోటాలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌లు ఉన్నారు. మరి వీరిలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: