ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు తీర్మానాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును  వెనక్కు తీసుకొని సంచలనం సృష్టించిన  జగన్ సర్కార్ మరో  బిల్లు రద్దు చేసేందుకు ముందుకు వచ్చింది. ఎందుకు రద్దు చేస్తోంది.. ఏం జరిగిందో తెలుసుకుందాం..?

 గత ఏడాది జనవరిలో  జగన్ సర్కార్  శాసన మండలి తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటన  చేసింది. ఆ దిశగానే అడుగులు వేసి తీర్మానాన్ని రద్దుచేసింది. అదేరోజు క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసి ఆమోదం కూడా తెలిపింది. ఈ యొక్క బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  కింద సర్కార్ కి పంపింది . కానీ కేంద్ర సర్కార్  ఈ యొక్క బిల్లుపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో ఆ బిల్లులు పెండింగ్లో పడింది. దీంతో వైసీపీ ఎంపీలు కొంతమంది కేంద్రాన్ని అడిగినప్పటికీ కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పరిపాలన వికేంద్రీకరణ సిఆర్ డి ఏ చట్టం రద్దు బిల్లులు ప్రభుత్వం శాసన సభలో ఆమోదించి గత ఏడాది జనవరి 20వ తేదీన శాసన మండలికి పంపించింది. మండలిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో టీడీపీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ  మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. సెలెక్ట్ కమిటీని కూడా నియమించారు.


 అయితే సెలెక్ట్ కమిటీ కార్యదర్శి శాసన మండలి చైర్మన్ యొక్క ప్రతిపాదనను వెనక్కి పంపించారు. శాసనమండలి ఆమోదించిన బిల్లును మండలి తిరస్కరించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేయాలని క్యాబినెట్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు.  అదే రోజు శాసనసభలో ఈ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించారు. శాసనమండలిలో ఈనెల 29వ తేదీ నాటికి వైసీపీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానుంది . స్థానిక సంస్థలు ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్సీలు శాసనమండలికి వస్తుండడంతో వీరంతా వైసిపి పార్టీకి చెందిన వారు కావడంతో మండలిలో వైసిపి పార్టీ బలం పెరుగుతుంది. దీంతో శాసన మండలి వద్ద బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మంగళవారం మండలి రద్దు ఉపసంహరణపై శాసనసభలో తీర్మానం చేయనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: