అగ్రరాజ్యమైన అమెరికా అన్ని దేశాల కంటే కాస్త ముందుగానే ఉంటుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని దేశాల కంటే ముందుగానే వైరస్ వ్యాక్సిన్ కనుగొంది అమెరికా. ఇక ప్రస్తుతం అమెరికాలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.. అయితే అగ్రరాజ్యమైన అమెరికా కు ఎక్కడా తీసిపోకుండా ఏకంగా మూడు వ్యాక్సిన్ లను తయారుచేసింది భారతదేశం. మొదట కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన సమయంలో వెనుకబడిన దేశంగా ఉన్న భారత్ వ్యాక్సిన్  విషయంలో అగ్రరాజ్యాల పైనే ఆధారపడి వస్తుంది అని అందరూ అంచనా వేశారు. ఇక 130 కోట్ల మంది జనాభా కలిగిన భారత్లో వ్యాక్సిన్ ప్రక్రియ ఎంతో క్లిష్టంగా మారిపోతుంది అని అందరూ అనుకున్నారు.



 కానీ అగ్రరాజ్యాల సైతం ఊహించని విధంగా భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఓవైపు 130 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కరోనా వైరస్ ఎక్కడ విజృంభించ కుండా   ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చింది భారత్. అదే సమయంలో శరవేగంగా అగ్రరాజ్యాలకు పోటీగా వ్యాక్సిన్ కూడా అభివృద్ధి చేయడం గమనార్హం.ఇక భారత్ లో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలోకి కూడా తీసుకు వచ్చింది. ఒకప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా తో వ్యాక్సిన్ విషయంలో భారత్  పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.



 ఇప్పటికే ప్రజలకు టీకాలు అందించడం విషయంలో అమెరికా తో పోల్చి చూస్తే మూడు రెట్లు ఎక్కువ భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.  ఇలా అగ్రరాజ్యమైన అమెరికా ను వ్యాక్సినేషన్ విషయంలో వెనక్కి నెట్టేసింది భారత్. ఇటీవలే వంద కోట్ల వాక్సినేషన్ మార్క్ ను కూడా అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వాక్సిన్ విషయంలో ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా సరసన చేరిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు. అమెరికాలో మూడు వ్యాక్సిన్ లు కనుక్కుంటే అటు అగ్రరాజ్యమైన అమెరికా కు పోటీగా భారత్లో కూడా మూడు వ్యాక్సిన్లు కనుకున్నట్లు తెలుస్తోంది. భారత్ బయోటెక్ కోవాక్సిన్, బిబిస్ నాసల్ వ్యాక్సిన్, జైడుస్ డిఎన్ఏ వ్యాక్సిన్ లు ప్రస్తుతం భారత్లో కనుగొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: