సంచలనం సృష్టించిన అధికార వైసీపీ ఎంఎల్సీ అనంతబాబు భవిష్యత్తుపై అప్పుడు చర్చలు మొదలైపోయాయి. ఎంఎల్సీ కారుడ్రైవర్ హత్యలో అనంతబాబుదే కీలకపాత్రగా బయటపడిన విషయం తెలిసిందే. కారుడ్రైవర్ సత్యనారాయణ హత్య తర్వాత రెండు రోజులు ఎంఎల్సీ ఆచూకీ దొరక్కుండా తప్పించుకున్నారు. ఎంఎల్సీని పట్టుకునేందుకు ఉన్నతాధికారులు ఐదు బృందాలను నియమించారు. మొత్తానికి సోమవారం ఉదయం అనంతబాబే పోలీసుల ముందు లొంగిపోయారు.





పోలీసు విచారణలో కారుడ్రైవర్ ను తానే హత్యచేసినట్లు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఎంఎల్సీ భవిష్యత్తుపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఎలాగూ లొంగిపోయాడు కాబట్టి ఎంఎల్సీకి  పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత జడ్జిముందు ప్రవేశపెట్టారు. జడ్జి ఎంఎల్సీకి రిమాండ్ విధించారు. ఈ నేపధ్యంలోనే ఎంఎల్సీ భవిష్యత్తుపై అనేకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కౌన్సిల్ సభ్యత్వం పోతుందని, సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దుచేయాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.





అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అనంతబాబు కౌన్సిల్ సభ్యత్వానికి ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమీలేదు. హత్యనేరం కోర్టులో విచారణ జరిగి, నిరూపణ అవ్వాలి. హత్యకేసులో ఎంఎల్సీకి 2 సంవత్సరాలకు మించిన శిక్షపడితే మాత్రమే అనంతబాబు సభ్యత్వం పోతుంది. కేంద్ర ఎన్నికల కమీషన్ నిబంధనల్లోని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్ళ శిక్షకన్నా ఎక్కువ పడితే అప్పుడు అనంతబాబు కౌన్సిల్ సభ్యత్వాన్ని శాసనమండలి రద్దు చేయగలుగుతుంది.






కోర్టులో విచారణ జరుగుతున్నంతకాలం, శిక్ష పడనంత వరకు శాసనమండలి ఎలాంటి జోక్యం చేసుకునే అవకాశంలేదు. ఇపుడు కోర్టు అనంతబాబుకు రిమాండు విధించినా శాసనమండలి చేయగలిగేదేమీలేదు. అనంతబాబును కనీసం సస్పెండ్ కూడా చేయలేందు. సమావేశాలపుడు కౌన్సిల్ కు రావటం రాకపోవటం అనంతబాబిష్టం. సో ప్రతిపక్షాలు, జనాలు డిమాండ్ల ప్రకారం అనంతబాబుపైన చర్యలు తీసుకునే అధికారం శాసనమండలికి లేదని అర్ధమైపోతోంది. కాకపోతే కోర్టులో విచారణ జరిగే విధానం, ఎంతతొందరగా హత్యానేరం నిరూపణవుతుందనేదే ఇక్కడ కీలకం. పోలీసుల అదుపులో హత్యానేరాన్ని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్న అనంతబాబు రేపు కోర్టులో ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: