ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. అదే తెలిస్తే.. అసలు ప్రమాదం జరిగే చేటుకి, ప్రమాదం జరిగే సమయానికి ఎవరూ వెళ్లాలనుకోరు. అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఇప్పుడు తరచూ జరగడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. విమానయానం అంత రిస్కా అనిపించేలా ఉంది. గతంలో కూడా విమాన ప్రమాదాలు జరిగేవి, వాతావరణం అనుకూలించక జరిగిన ప్రమాదాలే ఎక్కువ. కానీ ఇటీవల పరిస్థితులు కాదు, నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల వల్ల జరిగే ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో డీజీసీఏ కూడా దీనిపై విచారణ మొదలు పెట్టింది.

భారత్ లో నెల రోజుల వ్యవధిలోనే మొత్తం 9 మిడ్ ఎయిర్ ప్రమాదాలు జరగడం విశేషం. విమానాలు ఆకాశంలో ఉండగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇలా జులై 5 నుంచి జులై 21 మధ్య 9 ప్రమాదాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ప్రాణ నష్టం జరగకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఈ ప్రమాదాలన్నీ ప్రయాణికుల రక్షణను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

జులై 5న ఢిల్లీ నుంచి దుబాయ్ కి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ పనిచేయలేదు, దీంతో అర్థాంతరంగా ఆ విమానాన్ని కరాచీలో దించేశారు. జులై 14న ఇండిగో సంస్థకు చెందిన ఢిల్లీ- వడోదర విమానంలో సడన్ గా కుదుపులు వచ్చాయి. వైబ్రేషన్స్ రావడంతో జైపూర్ లో ఈ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. ఆపై ప్రయాణికుల్ని మరో విమానంలో తరలించారు. జులై15న ఎయిర్ ఇండియా విమానం బహ్రెయిన్ నుంచి కొచ్చికి బయలుదేరింది. విమానం కాక్ పిట్ లో పక్షి కనిపించడంతో.. కొచ్చిలో దించేసి ఆ సమస్యను పరిష్కరించారు. జులై 16న కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానంలో కాలిన వాసన వచ్చిందని అత్యవసరంగా ఆ విమానాన్ని ఒమన్ రాజధాని మస్కట్ లో దించేశారు.
జులై 17న షార్జా నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానాన్ని కూడా ఇలాగే కరాచీలో దించేశారు. జులై 19న ఇండిగో ఫస్ట్ ఎయిర్ లైన్స్ కి, 20వ తేదీన గో ఫస్ట్ విమానానికి, 21న బోయింగ్ విమానాన్ని కూడా ఇలాగే అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో సహజంగానే విమానయాన సంస్థల నిర్లక్ష్యం బయటపడుతోంది. గతంలో ప్రకృతి సిద్ధమైన అనుకూలత లేకపోవడంతో విమానాల ప్రయాణం ఆలస్యమయ్యేది, లేదా అత్యవసర ల్యాండింగ్ జరిగేది, కానీ ఇలా ఎప్పుడూ ఇంత తరచుగా జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: