ఢిల్లీ - చెన్నై: భయపెడుతున్న భూకంపాలు?

భూకంపాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇప్పటికీ చాలా దేశాల్లో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక టర్కీ పరిస్థితి గురించి కూడా తెలిసిందే. ప్రస్తుతం కొన్ని వేల మంది భూకంపం కారణంగా అక్కడ చనిపోయారు. ఇక ఇండియాలో కూడా ఈ భూకంపం భయాలు మొదలయ్యాయి.దీంతో ప్రజలు చాలా భయబ్రాంతులకి గురవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందో అని జనాలు ఎంతగానో భయపడుతున్నారు.చాలా మంది తమ ప్రాణాలను తమ చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.ఇక ఢిల్లీ, చెన్నైలో  భూకంపాలు భయం ఇంకా వెంటాడుతుంది.రెండు నాగరాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి.చెన్నైలోని అన్నా మౌంట్ రోడ్, ఈరోడ్ ఇంకా అన్నశాలై ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీయడం జరిగింది.ఇంకా అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం 1.35 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.ఈ రోజు కూడా వస్తాయేమో అని ప్రజలు ఎంతగానో భయపడుతున్నారు.


ఇందుకు కారణం అయితే, మెట్రో నిర్మాణ పనుల వల్ల ప్రకంపనలు వచ్చినట్లు కొంతమంది చెబుతున్నారు. మెట్రో అధికారులు మాత్రం ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం మెట్రో పనులు జరగడం లేదని చెప్పడం జరిగింది. అలాగే మరోవైపు, నేపాల్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ లోని జమ్లాకు మొత్తం 69 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంపకేంద్రం ఉందని అధికారులు చెప్పడం జరిగింది.ఇక భూప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు చాలా రకాలుగా భయాందోళనలకు గురయ్యారు. అలాగే, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా భారీగా భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్ లో భూకంప ప్రభావంతో ఉత్తర ఇండియాలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పస్థాయి భూప్రకంపనలు సంభవించడం జరిగింది.ఇక చూడాలి రానున్న రోజుల్లో ఈ ప్రమాదం వస్తుందో లేదో.. అధికారులు ఇప్పటికే అప్రమత్తం అవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: