తెలంగాణ రాష్ట్రం నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మొత్తం 118 మంది పై వివిధ కేసులు ఫిర్యాదు చేయబడ్డాయి అని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టు ధర్మానికి సవినయంగా వివరించింది. ఓ ఎంపీపై ఏకంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే స్థాయిలో కేసులు నమోదు అయ్యి ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ నుండి పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ తరఫున.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, సీఎం రమేష్, ఎంఐఎం పార్టీ తరపున అక్బరుద్దీన్, అసదుద్దీన్ మరియు తెరాస నుండి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు కూడా ఈ లిస్టులో ఉన్నారు.