పొద్దున్న లేస్తే ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని వెల్లంపల్లికి ఇప్పటినుంచే భయం పట్టుకుందట.. ఓవైపు ఈ ఘటనలో అయన ప్రభుత్వ ప్రమేయం లేదని ఎంత మొత్తుకున్నా కాణిపాక వినాయకుని ఆలయంలో ప్రమాణం చేస్తానని శపథం చేసినా ఎవరు వినకపోవడంతో అయన లో ఈ కొత్త భయం పట్టుకుందట.. ఈ సంఘటనలు ఏమో కానీ అవి తన పదవికి ముప్పు తెచ్చేలా ఉన్నాయని ఆయన రోజూ మీడియా ముందుకు వచ్చి తమ ప్రమేయం ఏమీ లేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు..