వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఎన్నికవడం ఖాయమని టీడీపీ నేతలు అనడం ఒకింత విడ్డూరంగా ఉంది.. ఇటీవలే లోకేష్ బాబు ఈ విషయం చెప్పడం మరింత విడ్డురంగా ఉంది.. చంద్రబాబే 2024లో సీఎం అన్న మాట కూడా ఓ కామెడిగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం చర్చనీయాంశం అవుతోంది. ఇక అమరావతి పర్యటనలో నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. తుళ్లూరు దొండపాడులో లోకేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు స్థానికులు.