ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది అందరు చూస్తున్నదే. మరి ఇపుడు కేంద్రప్రభుత్వంతో రాష్ట్రప్రభుత్వానికి మంచి సంబంధాలే ఉన్నయి. నిజానికి అవసరం లేకపోయినా మద్దతు కోరుతున్న కారణంగా పార్లమెంటులో వైసీపీ ఎంపిలు బిజేపీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జగన్ కున్న మంచి సంబంధాలు ఏ మేరకు అక్కరకు వస్తాయో చూడాల్సిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఇంకా తెలియలేదు.