నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు కు ఇప్పుడు ఉన్నది ఒకటే కోరిక.. అదేమిటో అందరికి తెలుసు.. తన కొడుకు లోకేష్ ని ముఖ్యమంత్రి గా చూడడం.. అందుకోసం ఎప్పుడు లేనంతగా కష్టపడిపోతున్నాడు చంద్రబాబు.. తన వయసుకు మించిన పనులు చేస్తూ రిస్క్ చేస్తున్నాడు.. అయితే ఎంత రిస్క్ చేసినా లోకేష్ తీరు మాత్రం మారట్లేదు.. తనకోసం చంద్రబాబు ఎవరినైనా ఎదిరించడానికి రెడీ గా ఉన్నాడు.. పార్టీ ని కూడా పణంగా పెట్టడానికి వెనుకాడట్లేదు.. వచ్చే ఎన్నికలనాటికి తన వయసు ఇంకా పెరిగిపోతుంది అప్పుడు ముఖ్యమంత్రి గా చేయాలంటే చాల కష్టం. ఈలోపు లోకేష్ ఒక నాయకుడు గా తీర్చిదిద్దాలనే తాపత్రయం చూస్తుంటే పాపం అనిపిస్తుంది.. అయితే చంద్రబాబు అంత చేస్తున్నా లోకేష్ లో ఉలుకూపలుకులేదు..