బీహార్ ఎన్నికలు అధికార ప్రతిపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవనున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలిచి తీరాలన్న కసి పట్టుదలతో ఇరువర్గాలు పనిచేసాయి. అయితే ఎన్నికల ముగిసాయి, ఫలితాలు వెల్లడాయె సమయం కూడా వచ్చేసింది. ఈరోజు ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వస్తుండడంతో అందరిలోనూ ఉత్కంఠ తారాస్థాయికి పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు అమిత్ షా లు ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించడంతో ప్రత్యేకత మరింత పెరిగింది.