బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చివరి వరకు దోబూచులాడాయి. అయితే ముందునుంచి అనుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ వ్యతిరేకంగా మారాయి. దేశంలో అందరి దృష్టి ఈ ఎన్నికల ఫలితాలపైనే కేంద్రీకృతమైందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒకానొక స్థితిలో ఎన్డీయే కూటమి వెనుకంజలో ఉన్నప్పటికీ చివరగా పుంజుకుని అధికారాన్ని తిరిగి దక్కించుజుంది.