తెలంగాణలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపద్యంలో రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. చలిగాలులతో పాటు పొగమంచు కురుస్తుండటంతో ప్రజలకు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడింది.