రష్యా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందరికంటే ముందుగా తయారుచేసిన "స్పుత్నిక్ వి" కరోనా వ్యాక్సిన్. త్వరలోనే మనదేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో సంయుక్తంగా రెడ్డి ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకోనున్నది. ఇప్పటికే వ్యాక్సిన్ హైదరాబాద్ నగరానికి చేరుకోగా....మనదేశంలో ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వడంతో మూడో దశ ట్రయల్స్ కు సర్వం సిద్ధమైంది.