ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు టైం బ్యాడ్ అని అయన గ్రహించకపోవడం విడ్డురంగా ఉంది. టైం బాలేనపుడు ఏం చేసినా ఫలితం రాదని నలభై ఏళ్ల రాజకీయ నాయకుడికి ఎందుకు అర్థం కావట్లేదు.. పార్టీ కి సంబందించిన ముఖ్య కార్య కలపాలని ఇప్పుడే చేస్తూ వాటి నెగెటివ్ ఫలితాలకు బలయిపోతున్నాడు..ఇటీవలే చంద్రబాబు తనదైన లెక్కలతో కింజారపు అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడి పీఠంపై కూర్చోపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అచ్చెన్న తనకంటే ముందు ఆ పదవిలో ఉన్న కళా వెంకట్రావులా కాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుండటంతో చంద్రబాబు తెగ ఇదైపోతున్నారని టీడీపీ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి.