రాష్ట్రంలో పంటికింద రాయిలా మారిన నిమ్మగడ్డ రమేష్ ప్రతిపక్షనేత చంద్రబాబు కన్నా ఎక్కువగా ప్రజల్లో నాకుతున్నారు సోషల్ మీడియా లో కూడా నిమ్మగడ్డ పేరు మార్మోగిపోతోంది.. ప్రభుత్వ వ్యతిరేక కలాపాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న నిమ్మగడ్డ వెనుక ఎవరున్నారనేది ఇన్నాళ్లు స్పష్టంగా తెలియకపోయినా ఇప్పుడు అయన వెనుక చంద్రబాబు ఉన్నారని క్లియర్ గా తెలుస్తుంది.. స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ వ్యవహార శైలి ఏమాత్రం బాలేదని ప్రజలు కూడా అంటున్న మాట..రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్య్ర సంస్థే అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ సహాయ, సహకారాలు ఎన్నికల నిర్వహణకు అవసరం ఉండకుండా ఉండదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఈసీ వ్యవహరించనది భిన్న రీతిలో నిమ్మగడ్డ వ్యవహారం నడుస్తుందన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యవహారశైలి కూడా ఉంటోంది.