జగన్ అధికారంలోకి వచ్చి సంవత్సరంనర దాటిపోయింది.. ప్రజలు జగన్ అధికారాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు.. సక్రమంగా సంక్షేమ పథకాలు పొందుతూ గతంలో ఎప్పుడు లేనంతగా సంతోషంగా ఉంటున్నారు. అయితే టీడీపీ వారికి మాత్రం జగన్ సీఎం అవడం ఏమాత్రం మింగుడు పడడం లేదు.. జగన్ తో కలిసి ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముందుకు రాలేదు కదా కనీసం మద్దతు కూడా తెలపలేదు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతలు సైతం తనను పొగడాలి అనుకునే చంద్రబాబు ఇప్పుడు దాన్ని మరిచి జగన్ ని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారు..పోయిన ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత జగన్ స్పోర్టివ్ గా తీసుకుని కొన్ని విషయాల్లో చంద్రబాబు కు సహకరించారు.. కానీ చంద్రబాబు ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి కూడా తన కన్నా చిన్నవాడైన జగన్ ని ఓర్వకుండా చూస్తున్నాడు.