ఢిల్లీ వెల్కమ్ ప్రాంతానికి చెందిన టీనేజ్ యువతి నిత్యం ఫోన్లో బిజీగా ఉంటోంది. మగపిల్లలతో వాట్సాప్ కాల్స్, చాటింగ్ చేసేది. ఆ విషయం ఆమె అన్న కి తెలియడంతో తీవ్రంగా మందలించాడు. మగపిల్లలతో చాటింగ్ చేయొద్దని వారించాడు. అయినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు..చెల్లెలు తన స్నేహితుడితో చాటింగ్ చేస్తూ కనిపించడంతో అన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది.దాంతో తుపాకితో కాల్చాడు.ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు..