ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో, పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న 9,700 పోస్టులు భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని, త్వరలో మరో 1,900 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల ప్రాణాలను రక్షించే ఆరోగ్యశాఖ ఎంతో కీలకమని. అటువంటి ఆరోగ్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటని ఆయన అన్నారు.