ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు భారత్ మీద పడింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ను ఉత్పత్తి చేయనున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వైపు ప్రపంచంలోని పేద.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు ఆశగా చూస్తున్నాయి. ఎందుకంటే.. ఈ వ్యాక్సిన్ రెండు డోసుల ధర తక్కువ ధరను కలిగి ఉండడం, మరియు స్టోర్ చేసే విధానం కూడా 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద అవకాశం ఉండడంతో దీనిపైనే అందరి కన్ను ఉంది.