మొదటిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కాకినాడ టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. దానికి రియాక్ట్ అయిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఒకే పార్టీలో ఉంటూ తనకు చెప్పాలి కదా అంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై మండిపడుతూ వాగ్వాదానికి దిగారు. దాంతో నిజాలు నిర్భయంగా మాట్లాడితే ఇలానే ఉంటుంది అంటూ... మేడ లైన్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ మునిగిపోయిందంటూ మరోసారి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.