ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యం ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ వైసిపి ఎంతగా బలపడిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధినేత జగనన్న నేతృత్వంలో పార్టీలోని నేతలు ప్రజలకు అండగా ఉంటూ వారి పనితీరుతో ప్రజలను మరింత ఆకట్టుకుంటున్నారు. ఇంత చేస్తున్నా ప్రతిపక్ష నాయకులు ఏదో రకంగా అధికార పార్టీని విమర్శిస్తూనే ఉన్నారు.. అయినా సంకల్ప బలంతో ముందుకు సాగుతోంది వైసిపి. ఆంధ్రప్రదేశ్ లో ఈ బలమే ఇప్పుడు టీడీపీకి బలహీనతగా మారింది.