ప్రపంచ దేశాలను గజగజ వణికించే కరోనా వైరస్ కు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రాణాంతక వైరస్ ఊపిరి తీసే గడియలు రాబోతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మొదటి నెల నుండి భారతదేశంలో కరోనా టీకాను దశల వారీగా ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఇప్పటికే ఈ విషయం పై ఎన్నో వార్తలు వచ్చాయి. భారత్లో కరోనా వైరస్ నివారణ టీకాలు వేయడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది.