బ్యాంక్ ఉద్యోగి స్నేహాలత కేసులో మరో ట్విస్ట్.. రాజేష్ తో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో పాటు కార్తీక్ తో సన్నిహితంగా ఉందనే అక్కసుతో బ్యాంక్ నుంచి తిరిగి వస్తున్న స్నేహలతను దారి మధ్యలో పొలాల వద్ద కాపు కాసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.. అత్యాచారం చేసి చంపారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. హత్య చేసిన తరువాత శరీరం కింది భాగంలో పెట్రోల్ పోసి తగులబెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది...పోలీసులు కార్తిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు..