జగన్ ని ఎలా చేసి అయినా పాలన సరిగ్గా చేయనీయొద్దని ప్రతిపక్షాలు డిసైడ్ అయ్యాయి.. పాలన సరిగ్గా ఉంటే జగన్ కొరకరాని కొయ్యగా మారిపోతాడు. ఈ నేపథ్యంలో జగన్ ఎలాగైనా ఇబ్బంది పెట్టి అధికారంలోనుంచి దింపేయాలి వారి ఆలోచన.. దీనికి తోడుగా నిమ్మగడ్డ రమేష్ కూడా ప్రతిపక్ష నాయకులకు తోడయ్యాడు.. జగన్ సీఎం అయినా దగ్గరి నుంచి ప్రతిపక్షాలు ఎదో విధంగా జగన్ తొక్కేయాలని చూస్తున్నాయి.. సీఎం గా ఎన్నాళ్ళు కొనసాగుతాడో చూస్తామన్నట్లు మొదట్లో వారి ప్రవర్తన ఉండగా చంద్రబాబు లాంటి నేతలని జగన్ నిలువరించడం చూసి జగన్ సామాన్యుడు కాదని టీడీపీ నేతలు సైతం అభిప్రాయపడ్డారు..