తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు దీటుగా నిలబడింది ప్రత్యర్థి పార్టీ బిజెపి. దుబ్బాక ఎన్నికలతో మొదలైన బిజెపి జోరు, గ్రేటర్ ఎన్నికల వరకు పాకింది. అయితే బిజెపి స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నాలు చేస్తోంది టిఆర్ఎస్. అయితే ఇప్పుడు మరో సరికొత్త ప్లాన్ తో బిజెపి క్రేజ్ తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.