ప్రపంచ దేశాలను గడగడ వణికించిన కరోనా వైరస్.... ఇండియా ని కూడా వదలకుండా ముప్పుతిప్పలు పెట్టింది. అయితే కొద్ది రోజులుగా భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే ఇండియా లో కరోనా వ్యాప్తి శాతం ఇప్పుడు చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. నెమ్మది నెమ్మదిగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటూ... ఇంతకు ముందులా రోడ్ల పై కనిపిస్తున్నారు.