కడపలో నగర అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించిన కూడా నత్త నడక గా కొనసాగుతున్నాయి. 2019-20లో 14వ ఆర్థిక సంఘం ముగిసింది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం కూడా ఆరంభమైంది. జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 6 పురపాలక సంఘాలు, 2 నగర పంచాయతీలకు గత అయిదేళ్లలో రూ.251.28 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.75 కోట్ల పనులు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. జులై 3, 2019 నాటికి పురపాలక సంఘాల్లోని పాలకవర్గాల గడువు ముగియడంతో అప్పటినుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.