ఏపీలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకమైనా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని తెలుస్తున్నా ఎవరికి వారు తమ తమ ప్రణాళికల్లో మునిగిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని జిల్లాలో ఆ పార్టీ నాయకులు అక్కడే తిష్ట వేశారు. ముఖ్యంగా ప్రజలు వేటికైతే ఆకర్షితులవుతారో ఆ హామీలను ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.