అమరావతికి సంబంధించి ప్రముఖ వార్త పత్రిక ఒక వార్తను ప్రొజెక్ట్ చేసింది. గతంలో ఏపీ తాత్కాలిక రాజధాని అమరావతి భవనాల నిర్మాణానికి రెండువేల అరవై కోట్లు ఋణం ఇచ్చియున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన పనులు అప్పట్లో వివిధ కారణాల వలన నిలిచిపోవడం జరిగింది. ఇలా నిలిచిపోయిన పనులు ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం సకాలంలో దీనికి కావాలన్న నిధులను అప్పు ఇవ్వకపోవడమే అని తెలుస్తోంది.