ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడంతో చాలామందికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. హాస్పిటల్ కి వెళ్లి అటువంటి వ్యక్తులకు చికిత్స ఇప్పిస్తే (అవసరాన్ని బట్టి ఆక్సిజన్ సిలిండర్ తో ఆక్సిజన్ ఇప్పించడం వంటివి) చాలామంది ప్రమాదం నుండి బయట పడి కోలుకుంటున్నారు.