ఇంతటి కరోనా సంక్షోభంలోనూ మొన్న అయిదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయంలో... ఎన్నికలు, గెలుపు , ఓటమి మరియు పరిపాలన ఇవన్నీ సాధారణమే. అయితే ఒక నాయకుడు గెలుపు వచ్చినప్పుడు గర్వపడకుండా, ఓటమి చెందినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి తన పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకు అండగా నిలబడాలి.