అమెరికా దేశ ప్రజలకు కరోనా నుండి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ప్రస్తుతం అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఆ దేశ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం రోజూ దాదాపుగా 50 వేల నుంచి లక్ష లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది.