తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. కథ మొత్తం ఈటల రాజేందర్ చుట్టూనే తిరుగుతోంది. తెరాస పార్టీకి మరియు హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఎమ్మెల్యే ఉప ఎన్నికకు తెరలేచింది. కాగా రాజేందర్ తన మిగిలిన రాజకీయ భవిష్యత్తును జాతీయ పార్టీ అయిన బీజేపీ తో కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు.