ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ ఏ ఉద్యమాన్ని అయితే అడ్డు పెట్టుకుని ప్రత్యేక తెలంగాణ సాధించి గద్దెనెక్కారో ? ఇప్పుడు ఆ పదవికే చిల్లు పడేలా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి కారణం రోజు రోజుకీ మారుతున్న రాజకీయ సమీకరణాలే ? కొద్ది రోజుల క్రితమే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.