దళిత బంధు పేరుతో కుటుంబానికి 10లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్న కేసీఆర్.. ఇంకా ఎవరికైనా బాకీ ఉన్నారా..? ఉన్నారనే అంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో నిరుద్యోగులందరికీ ఒక్కొక్కరికి కేసీఆర్ లక్ష రూపాయలు బాకీ పడ్డారని చెబుతున్నారు. దానికి తగిన లెక్కలు కూడా చెబుతున్నారు రేవంత్ రెడ్డి.