ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లె అన్న సంగతి తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నది అదే జిల్లాలోని కుప్పం నియోజకవర్గం. అంటే ఆయన రాయలసీమ బిడ్డ.. ఆయన ఓ రాయలసీమ ఎమ్మల్యే.. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే.. ఇటీవల చంద్రబాబు తరచూ చేస్తున్న విమర్శలు కొన్ని సందేహాలు లేవనెత్తుతున్నాయి.
చంద్రబాబు తరచూ జగన్ సర్కారు తీరును విమర్శిస్తూ.. ఓ మాట చెబుతున్నారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయతీలు చేయనివ్వనంటున్నారు.. అంతే కాదు.. ఆయన తరచూ కడప రౌడీలు, పులివెందుల రౌడీలు, రాయలసీమ రౌడీలు అంటూ వైసీపీ నేతలను విమర్శిస్తుంటారు. ఓ రాయలసీమ బిడ్డ అయి ఉండి అలా మాట్లాడటం సిగ్గు చేటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
కడప రౌడీలు, పులి వెందుల రౌడీలు, రాయల సీమ రౌడీలు అనే మాటలు తప్ప చంద్రబాబుకు వేరే మాటలు రావా ?.. అని నిలదీస్తున్నారు వైసీపీ పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్. ఏం చంద్రబాబు రాయల సీమలో పుట్ట లేదా ? ఆయనకు రాయలసీమ పౌరుషం లేదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు చౌకబారు వేషాలు ఇంకా మానుకోకపోతే ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మైండ్ బ్లాకైపోయిందని జోగి రమేష్ వెటకారం ఆడారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రజలను ఓదార్చాల్సిన అవసరం లేదంటున్నారాయన. చంద్రబాబునే ప్రజలు ఓదార్చాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పినా.. ఇంకా బుద్ది రాలేదని జోగి రమేశ్ మండిపడ్డారు. రాజకీయ నాయకులైనా, ప్రజా ప్రతినిధులైనా, అధికారులైనా, ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని తమ నాయకుడు జగన్ ఖరాఖండిగా చెప్పారని జోగి రమేశ్ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పాలనలోని అవినీతి సాక్ష్యాలతో సహా నిరూపిస్తామంటున్నారు రమేశ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి