బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంతో హైదరాబాద్ వాసులు ఒక్కసారిగా భయాందోళనలకు గురి అవుతున్నారు. నవంబర్ 4న ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కాగా.. శనివారం జరిగిన ప్రమాదం రెండోది కావడంతో ఆందోళన పడుతున్నారు. ఇక ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ సరిగా లేదని సివిల్ ఇంజనీర్లు, రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ వల్ల అభిప్రాయాలను తెలుపుతున్నారు. డిజైనింగ్ లోపాలను ఎత్తి చూపిన నిపుణులు.. వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.
వాస్తవానికి ఫ్లైఓవర్ నిర్మాణం దృఢంగా, మన్నికగా ఉంది. కానీ డిజైన్ విషయానికి వస్తే.. తీసికట్టుగా ఉంది అని తెలుస్తుంది. తిన్నగా ఉన్న రోడ్డు మీద స్పీడ్ పెంచడం, తగ్గించడం వల్ల వాహన స్థిరత్వానికి వచ్చే ప్రమాదం మాత్రం ఏమి ఉండదు అని నిపుణులు అంటున్నారు. కానీ మలుపు వద్ద వాహనం స్పీడ్‌గా వెళ్తే.. అపకేంద్ర బలం వల్ల వాహనం బయటి వైపు వెళ్లడం జరుగుతుంది అని అంటున్నారు. స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా వాహనం స్కిడ్ అయ్యే రిస్క్ ఉంది అని ప్రొఫెషనల్ బాడీ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ వరల్డ్ కాంగ్రెస్-ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్పీ అంచూరీ తెలియచేయడం జరిగింది.
వాస్తవానికి ఫ్లై ఓవర్ మీద S లాంటి మార్గాలు ఒకదాని వెంట రెండున్నాయి. ఇలా మలుపు ఉన్న చోట తప్పకుండా ట్రాన్సిషల్ జోన్ ఉండాలి. కానీ ఇక్కడ అది లేదని డాక్టర్ అంచూరీ తెలియచేయడం జరిగింది. మలుపులు ప్రమాదకరంగా ఉండటమే కాదు.. రక్షణ గోడ ఎత్తు కూడా పెంచాలని నిపుణులకు తెలియచేయడం జరిగింది.
‘ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాల మేరకే ఫ్లైఓవర్ మీద రక్షణ గోడను (క్రాష్ బ్యారియర్)లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడి పరిస్థితులు, డ్రైవింగ్ సిస్టమ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎత్తు పెంచాలి అని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. దీని వల్ల వేగంగా వెళ్లిన వాహనాలు ఫ్లైఓవర్ పై నుంచి కింద పడకుండా ఉంటుంది అని రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఛైర్మన్ షేక్ సలావుద్దీన్ తెలియచేయడం జరిగింది. స్పీడ్ తగ్గించుకోవాలని వాహనదారులకు దూరం నుంచి ఎలాంటి సూచికలు, హెచ్చరిక బోర్డులు కనిపించడం లేదని కూడా నిపుణులు తెలియచేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి