ఏపీలో జగన్ ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. కొద్దికాలంలోనే జగన్ పాలనలో తనదైన ముద్ర వేశారు. సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు.. ఇంత తక్కువ కాలంలోనే ఎన్నో సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పాలనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందింస్తున్నారు.
ఏపీ నాయకుల సంగతిపక్కన పెడితే.. పొరుగున ఉన్న తెలంగాణ నేత కేటీఆర్ జగన్ ఆరు నెలల పాలనపై కామెంట్ చేశారు. కేటీఆర్.. విద్యాధికుడు, టెక్నాలజీని బాగా వాడుకునే ఆధునిక రాజకీయ వేత్త.. అందుకే ఆయన తరచుగా ట్విట్టర్ ద్వారా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంటారు. తాజాగా కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విటర్లో.. ఆస్క్ కేటీఆర్ నిర్వహించారు. నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు. అలాంటి ప్రయత్నం చేస్తే.. కొందరు ఆసక్తికరమై ప్రశ్నలు అడిగి కేటీఆర్ నుంచి సమాధానాలు రాబట్టారు.
అందులో భాగంగా ఓ నెటిజన్.. జగన్ ఆరు నెలల పాలన ఎలా ఉందంటూ ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన కేటీఆర్ జగన్ ఆరు నెలల పాలన బావుందంటూ కితాబిచ్చారు. మరి మూడు రాజధానుల అంశంపై ప్రస్తావిస్తే మాత్రం దాని గురించి నిర్ణయించాల్సింది తాను కాదని, ఆంధ్ర ప్రజలు అని ఆయన అన్నారు. సినిమాలలో నటిస్తారా అని అడిగితే తనకు ఇక్కడ పుల్ పని ఉందని ఆయన అన్నారు. మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని కూడా తెలంగాణకు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని కెటిఆర్ చెప్పారు. తనకు రాజకీయాలలో స్పూర్తి కెసిఆర్ అని ఆయన అన్నారు.
ఇదే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నెటిజన్లు ప్రశ్నలు వేశారు. టీ హబ్ ఫేజ్ 2 ఎప్పుడు ప్రారంభిస్తారు? అని అడిగితే.. 2020 ఫస్టాపు లోపు ప్రారంభిస్తామన్నారు కేటీఆర్. మీకు ప్రస్తుత రాజకీయాల్లో మీకు ఎవరు స్పూర్తి? అని అడిగితే ఊహించే సమాధానమే ఇచ్చారు. ఇంకెవరు.. రెండో ఆలోచన లేకుండా కేసీఆర్ గారు అని బదులిచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి