అమరావతి రాజధాని గ్రామాల విషయంలో హై పవర్ కమిటి కీలక నిర్ణయం తీసుకుంది.  ఈరోజు జరిగిన సమావేశంలో  రాజధాని తరలింపుపై తమ అభ్యంతరాలను తెలిపేందుకు రైతులు ముందుకు రావాలంటూ మంత్రులు ఆహ్వానించారు.  రాజధాని తరలింపు విషయంలో రైతులకున్న అభ్యంతరాలను ఈనెల 17వ తేదీ లోగా సిఆర్డిఏ కమీషనర్ కు చెప్పాలని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. ఈ మెయిల్స్, రాత పూర్వకంగా అభ్యంతరాలు, పరిష్కారాలను తెలియజేయాలన్నారు.

 

మొత్తానికి రాజధాని తరలింపులో కీలకమైన రైతాంగం సమస్యలపై హై పవర్ కమిటి దృష్టి పెట్టిన విషయం అర్ధమవుతోంది. రాజధానిని అమరావతి నుండి తరలించేందుకు లేదంటూ గడచిన 27 రోజులుగా రాజధాని ప్రాంతంలోని ఓ ఐదారు గ్రామాల్లోని రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే రైతుల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులు, టిడిపి నేతలు చేరిపోయే అల్లర్లు చేస్తున్నారంటూ అధికార పార్టీ ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పట్లో రాజధాని నిర్మాణానికి భూములు తీసుకుంటానంటే అప్పుడు చంద్రబాబునాయుడును శాపనార్ధాలు పెట్టారు. ఇపుడు మీ భూములు తిరిగేచ్చాస్తనని  అంటుంటే ఇపుడు  జగన్ ను కూడా శాపనార్ధాలు పెడుతున్నారు. అంటే ఇపుడు ఆందోళనలు చేస్తున్న వారిలో రైతులకన్నా వాళ్ళ నుండి భూములు కొనేసిన వారు, బ్రోకర్లు, టిడిపి నేతలే ఎక్కువ మందున్నారు.

 

రాజధాని తరలిస్తానని ప్రభుత్వం అంటుంటే రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోతుందన్న ఏకైక కారణంతోనే రైతుల ముసుగులో ఆందోళనలు జరుగుతున్నాయి. వాళ్ళకి మద్దతు కూడగట్టేందుకే చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ ఉద్యమ విరాళాలంటూ నానా యాగీ చేస్తున్నారు. అందుకే నేరుగా ఈ ప్రాంతంలోని రైతులు మాత్రమే తమ అభ్యంతరాలను, సమస్య పరిష్కారాలను చెబుతూ సిఆర్డీఏ కమీషనర్ కార్యాలయానికి లేఖలు లేకపోతే ఈ మెయిల్స్ పంపాలని పేర్ని నాని స్పష్టంగా చెప్పారు. మరి రైతులు స్పందిస్తారా ? చూడాల్సిందే ఏం జరుగుతుందో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: